కావలిలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం..
ABN , Publish Date - Mar 23 , 2026 | 08:32 PM
సోమవారం నెల్లూరు జిల్లాలోని కావలి బాపూజీ నగర్ కాలనీలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, ఆంధ్రజ్యోతి బీఎం హరికృష్ణ పాల్గొన్నారు.
ప్రజల సమస్యలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అక్షర యుద్ధం చేస్తోంది.. నగరాల్లో ప్రధాన సమస్యలు ఉన్న వార్డులను ఎంపిక చేసుకుని పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది.. అక్షరమే ఆయుధమై ప్రజల చెంతకే వెళుతోంది. సోమవారం నెల్లూరు జిల్లాలోని కావలి బాపూజీ నగర్ కాలనీలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, ఆంధ్రజ్యోతి బీఎం హరికృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే కావ్యా దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే సావధానంగా స్థానికుల సమస్యలు విన్నారు. సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు.
కాగా, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేపట్టిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం అన్ని వర్గాలనుంచి ప్రశంసలు అందుకుంటోంది. కొద్దిరోజుల క్రితం యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమంపై ప్రశంసల జల్లులు కురిపించారు. ప్రజాసమస్యల పరిష్కారంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కృషి విశేషమైనదని ఎమ్మెల్యే విజయ్ కుమార్ అన్నారు. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన ‘ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి’ యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యలను నేరుగా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావడంలో ఇలాంటి వేదికలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
తెలంగాణ కేబినెట్ ముందుకు 10 కీలక బిల్లులు
మోదీ రాజీపడ్డారు, పార్లమెంటులో చర్చకు రావడం లేదు.. వడోదరలో రాహుల్