Share News

EXAMS: సజావుగా పది పరీక్షలు ప్రారంభం

ABN , Publish Date - Mar 16 , 2026 | 11:55 PM

పట్టణంలో పదో తరగతి పరీక్షలు సోమవారం సజావుగా ప్రారంభ మయ్యాయి. మండల వ్యాప్తంగా ఆరు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంఈఓ రవినాయక్‌ తెలిపారు. మొత్తం 1518 మందికి గాను 26 మంది గైర్హాజరయ్యారు.

EXAMS: సజావుగా పది పరీక్షలు ప్రారంభం
Students appeared at Guttilo examination center

గుత్తి, మార్చి 16(ఆంధ్రజ్యోతి) : పట్టణంలో పదో తరగతి పరీక్షలు సోమవారం సజావుగా ప్రారంభ మయ్యాయి. మండల వ్యాప్తంగా ఆరు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంఈఓ రవినాయక్‌ తెలిపారు. మొత్తం 1518 మందికి గాను 26 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేం ద్రాల వద్ద సీఐ రామారావు, ఎస్‌ఐ సురేష్‌ బందోబస్తు నిర్వహించారు.

గుంతకల్లుటౌన: పట్టణంలోని తొమ్మిది పరీక్ష కేంద్రాలలో మొత్తం 2388 మంది విద్యార్థులకు గాను 17 మంది గైర్హాజరయ్యారని ఎంఈఓ మస్తాన రావు తెలిపారు. చైతన్య-3, రాజేంద్రప్రసాద్‌ పాఠశాలలో పరీక్ష ప్రశ్న పత్రాలను అలస్యంగా ఇచ్చారని విద్యార్థులు తెలిపారు. అయితే సరైన సమయానికి పేపర్లు ఇచ్చామని, ఇంకోసారి అలా జరగకుండా చర్యలు తీసుకుంటామని ఎంఈఓ మస్తానరావు తెలిపారు.

పామిడి: మండలంలో మొదటి రోజు పదో తరగతి పరీక్షలకు ము గ్గురు గైర్హాజరైనట్లు ఎంఈఓ జయానాయక్‌ తెలిపారు. టీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 260మందికి 259మంది, సరస్వతీ విద్యా మందిరం లో 239 మందికి 237మంది హాజరైనట్లు తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఎస్‌ పరీక్షా కేంద్రంలో 242మందికి గాను అందరూ హాజరైనట్లు వెల్లడించారు.

ఉరవకొండ: పట్టణంలోని ఐదు పరీక్ష కేంద్రాల్లో మొత్తం 1,135 మందికి గాను 1,112 మంది హాజరయ్యారు. 23 మంది గైర్హాజరయ్యారు. వజ్రకరూరు మండలంలో మూడు కేంద్రాలలో 664 మందికి గాను631 మంది హాజరయ్యారు. 13 మంది గైర్హాజరయ్యారు. కొనకొండ్లలోని జి ల్లా పరిషత ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని డీవైఈవో శ్రీనివాసరావు తనిఖీ చేశారు. వజ్రకరూరు మండల కేంద్రంలో పరీక్ష కేంద్రాలను తహసీల్దారు నరేష్‌, ఎంఈవో ఎర్రిస్వామి పరిశీలించారు.


రాయదుర్గంరూరల్‌: పట్టణంలోని తొమ్మిది కేంద్రాలలో 1,601 వి ద్యార్థులకు గాను 1,584 మంది పరీక్షకు హాజరు కాగా 17 మంది గైర్హాజ రైనట్లు ఎంఈఓలు మహమ్మద్‌ ఇర్షాద్‌, వెంకట రమేష్‌ తెలిపారు. బా లుర ఉన్నత పాఠశాలలో ఒకరు, నారాయణ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ లో ముగ్గురు, సెయింట్‌పాల్స్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో ఐదుగురు, పీఎస్‌ఆర్‌ పాఠశాలలో ముగ్గురు. కళ్లీమఠం పాఠశాలలో ఒకరు, కేవీఆర్‌ పాఠశాలలో నలుగురు గైర్హాజరైనట్లు తెలిపారు. పట్టణంలోని పరీక్ష కేంద్రాలను డీఎస్పీ రవిబాబు తనిఖీ చేశారు. గట్టి బందోబస్తు నిర్వహించినట్లు అర్బన సీఐ జయనాయక్‌ తెలిపారు.

బొమ్మనహాళ్‌: మండల కేంద్రంలో మూడు, ఉద్ధేహాళ్‌ గ్రామంలో ఒక కేందాన్ని ఏర్పాటు చేశారు. నాలుగు కేంద్రాల్లో మొత్తం 990 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 968 మంది హాజరయ్యారు. 22 మంది గైర్హాజరయ్యారని ఎంఈఓ మల్లికార్జున తెలిపారు.

బెళుగుప్ప: మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన పదో తరగతి పరీక్ష కేంద్రాలను స్క్వాడ్‌ బృందం ఎంఈవో నరసింహా రెడ్డి, డీటీ గోపీనాథ్‌, ఏఎస్‌ఐ మాధవ్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

తాడిపత్రి: పట్టణంలో సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షలకు మొత్తం 2674మంది విద్యార్థులు హాజరయ్యారు. 33మంది గైర్హాజర య్యారని ఎంఈఓలు నాగరాజు, రామగోవింద్‌రెడ్డి తెలిపారు. పదకొండు రెగ్యులర్‌ పరీక్ష కేంద్రాల్లో మొత్తం 2564మందికి 2552మంది హాజర య్యారు. 12మంది గైర్హాజరయ్యారు. అలాగే రెండు ఓపెన పరీక్షకేంద్రా ల్లో 143మందికి గాను 122మంది హాజరయ్యారు. 21మంది గైర్హాజర య్యారని అధికారులు తెలిపారు.

యాడికి: మండలవ్యాప్తంగా 750మంది విద్యార్థులకు మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. మొదటి రోజు ఏడుగురు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. యాడికి హైస్కూల్‌ ఏ, బీ కేంద్రాలను స్క్వాడ్‌ మహేశ్వర్‌రెడ్డి తనిఖీ చేశారు. పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.


పెద్దవడుగూరు: మండలకేంద్రంలో సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షల్లో 414మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 410మంది హాజరయ్యారని ఎంఈఓ రాముడు తెలిపారు.

కుందుర్పి: మండల కేంద్రంలోని మూడు కేంద్రాల్లో 701 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు నిర్వహించారు.

యల్లనూరు: మండల కేంద్రంలోని జి ల్లా పరిషత పాఠశాలలో 128మంది విద్యార్థులకు గాను 128మంది హాజరుకాగా, చిలమకూరు ఆదర్శపాఠశాలలో 136మందికి గాను 135మంది హాజరైనట్లు ఎంఈఓ చంద్రశేఖర్‌ తెలిపిరు. చిలమకూరు ఆదర్శ పాఠశాలకు వెళ్లేందుకు సరైన బస్సు సౌకర్యాలు లేకపోవడంతో తల్లిదండ్రులు ద్విచక్రవాహ నాల్లో తమ పిల్లలను తీసుకొచ్చారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 16 , 2026 | 11:55 PM