Share News

జనసేన తరఫున 70 ఏళ్ల వృద్ధురాలు

ABN , Publish Date - Oct 24 , 2026 | 06:10 AM

ఆమె చేతికర్ర లేకుండా సరిగా నడవలేని 70 ఏళ్ల వృద్ధురాలు. అయినా ప్రియతమ నాయకుడి కోసం ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్‌ వేసింది.

జనసేన తరఫున 70 ఏళ్ల వృద్ధురాలు

మదనపల్లె టౌన్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఆమె చేతికర్ర లేకుండా సరిగా నడవలేని 70 ఏళ్ల వృద్ధురాలు. అయినా ప్రియతమ నాయకుడి కోసం ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్‌ వేసింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం చిన్నతిప్పసముద్రం(సీటీఎం)-1 ఎంపీటీసీ మహిళలకు రిజర్వయింది. దీంతో ఉప్పు ఉత్తమ్మ(70) ఎన్నికల్లో పోటీకి ఉత్సాహం కనబరచింది. ఆమె ఉత్సాహాన్ని చూసి జనసేన నాయకుడు, చిన్నతిప్పసముద్రానికి చెందిన చిన్నరెడ్డి ఆమెను ఆటోలో నామినేషన్‌ కేంద్రానికి తీసుకొచ్చి నామినేషన్‌ వేయించారు.

ఈ వార్తలనూ చదవండి:

పల్లె పండుగకు నిధుల గండం

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Updated Date - Oct 24 , 2026 | 06:10 AM