4 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయి స్వాధీనం
ABN , Publish Date - Oct 26 , 2026 | 06:19 AM
కోట్ల రూపాయల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయిని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్‌ఐ(డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు పట్టుకున్నారు.
భోగాపురం ఎయిర్‌పోర్టులో పట్టివేత.. నిందితుడి అరెస్టు
విజయనగరం, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): కోట్ల రూపాయల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయిని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్‌ఐ(డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు పట్టుకున్నారు. కోల్‌కతాకు చెందిన మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్ సింగపూర్ నుంచి భోగాపురం విమానాశ్రయానికి ఆదివారం చేరుకున్నాడు. పక్కా సమాచారంతో అప్రమత్తమైన అధికారులు తనిఖీలు నిర్వహించి హైటైడ్ డాగ్ సహాయంతో గంజాయిని గుర్తించారు.
సూట్‌కేసు లోపల కార్బన్ పేపరు చుట్టి నాలుగు వరుసల్లో పేర్చి తరలిస్తున్న నాలుగు కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దానిని బ్యాంకాక్‌లో సేకరించి సింగపూర్ మీదుగా తరలించినట్లు అధికారులు తెలిపారు. భోగాపురం విమానాశ్రయంలో ఈ తరహా గంజాయి అక్రమ రవాణా తొలిసారిగా వెలుగుచూడటం గమనార్హం. నిందితుడిని అరెస్ట్ చేసి విజయనగరం సెషన్స్ కోర్టుకు తరలించారు.
ఈ వార్తలనూ చదవండి:
అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం