Share News

నవంబరు 1 నుంచి ధాన్యం కొనుగోళ్లు

ABN , Publish Date - Sep 26 , 2026 | 03:31 AM

ఖరీఫ్‌ సీజన్‌లో 37 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం రైతుల నుంచి సేకరించనున్నట్టు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. నవంబరు ఒకటో తేదీ నుంచి ఈ ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తామన్నారు.

నవంబరు 1 నుంచి ధాన్యం కొనుగోళ్లు

  • ఖరీఫ్‌ ఉత్పత్తుల సేకరణకు పక్కా ఏర్పాట్లు

  • మంత్రి నాదెండ్ల మనోహర్‌ వెల్లడి

అమరావతి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : ఖరీఫ్‌ సీజన్‌లో 37 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం రైతుల నుంచి సేకరించనున్నట్టు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. నవంబరు ఒకటో తేదీ నుంచి ఈ ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వానికి ధాన్యం విక్రయించిన రైతులకు మద్దతు ధర ప్రకారం సొమ్మును 24 గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంతోపాటు తమ ధాన్యాన్ని సొంత వాహనాల్లో మిల్లులకు తరలించే రైతులకు రవాణా చార్జీలను కూడా వెంటనే చెల్లిస్తామని మంత్రి చెప్పారు. దీనికోసం 6.10 కోట్ల గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఖరీఫ్‌ సీజన్‌ ధాన్యం సేకరణపై శుక్రవారం విజయవాడలో రాష్ట్రస్థాయి సన్నాహక సమావేశం (వర్క్‌షాపు) నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ....ఖరీఫ్‌ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 2,619 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, దాదాపు 24 వేల మంది సిబ్బంది అక్కడ ఉంటారని తెలిపారు. ధాన్యం సేకరణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ వార్తలనూ చదవండి..

ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్

హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ

Updated Date - Sep 26 , 2026 | 03:31 AM