ఐటీ జాబ్‌కు బై.. గ్రామ సేవకు జై!
ABN , Publish Date - Nov 21 , 2026 | 01:11 AM
రాజకీయాల వైపు యువత ఆసక్తి పెరుగుతోంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం (సెజ్ పునరావాస కాలనీ) సర్పంచ్ పదవికి...
దిబ్బపాలెం సర్పంచ్ పదవికి 24 ఏళ్ల యువతి హారిక నామినేషన్
అచ్యుతాపురం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): రాజకీయాల వైపు యువత ఆసక్తి పెరుగుతోంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం (సెజ్ పునరావాస కాలనీ) సర్పంచ్ పదవికి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేసుకుంటూ.. ఇటీవల రాజీనామా చేసిన 24 ఏళ్ల యువతి రాజాన హారిక శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ తరఫున బరిలోకి దిగారు.
దిబ్బపాలేనికి చెందిన హారిక బీటెక్ పూర్తిచేసి, చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా ఇటీవలి వరకూ పనిచేశారు. ఆమె తండ్రి చనిపోగా... తాత, బాబాయ్, మేనమామలు రాజకీయాల్లో ఉన్నారు. సర్పంచ్, ఎంపీటీసీలుగా పనిచేశారు. ప్రస్తుత ఎన్నికల్లో దిబ్బపాలెం సర్పంచ్ పదవిని బీసీ మహిళకు కేటాయించారు. ఈ క్రమంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు హారిక ముందుకొచ్చారు. అందుకు తొలుత కుటుంబసభ్యులు అంగీకరించలేదు. ఉద్యోగం వదులుకుని చిన్న వయసులో రాజకీయాల్లోకి రావొద్దని నచ్చజెప్పబోయారు. అయినప్పటికీ హారిక పట్టు వదలకపోవడంతో వారు అంగీకరించక తప్పలేదు.
ఈ వార్తలనూ చదవండి:
పంట నష్టంపై సాయం అందించండి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు చంద్రబాబు వినతి
తాడిపత్రిలో హైటెన్షన్.. టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడి