19 ఏళ్లకే చైర్‌పర్సన్
ABN , Publish Date - Nov 05 , 2026 | 05:06 AM
నిడదవోలు పాలక మండలిని 19 ఏళ్ల ప్రథమ పౌరురాలు మురాల జ్యోతి నడిపించనున్నారు. ఈ పాలక మండలి జ్యోతి సహా కొత్త వాళ్లతో కొలువుదీరనుంది. మొత్తం 32 మందిలో 28 మంది మొదటిసారి కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు.
రాజమహేంద్రవరం, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): నిడదవోలు పాలక మండలిని 19 ఏళ్ల ప్రథమ పౌరురాలు మురాల జ్యోతి నడిపించనున్నారు. ఈ పాలక మండలి జ్యోతి సహా కొత్త వాళ్లతో కొలువుదీరనుంది. మొత్తం 32 మందిలో 28 మంది మొదటిసారి కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. జనసేన అభ్యర్థిని మురాల జ్యోతికి 14,922 (63 శాతం) మంది ఓటర్లు జైకొట్టగా.. ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వేదాల విజయలక్ష్మికి 8,340(35శాతం) ఓట్లు వచ్చాయి. జ్యోతి అత్యంత సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తండ్రి ఇదే మునిసిపాలిటీలో పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తూ చాలా ఏళ్ల కిందటే చనిపోయారు. తర్వాత తల్లి కూడా మరణించారు. అక్క, అన్నయ్యతో కలిసి జీవిస్తూ.. ఓ ఆస్పత్రిలో నర్సుగా జ్యోతి పని చేస్తున్నారు.
- రాజమహేంద్రవరం, ఆంధ్రజ్యోతి
ఈ వార్తలనూ చదవండి:
ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్
ఫోర్జరీ, చీటింగ్ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్