Share News

బ్రేకులు ఫెయిలై..కొండను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

ABN , Publish Date - Nov 30 , 2026 | 02:05 AM

ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలై కొండను ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్‌, కండక్టర్లు సహా 18 మంది ప్రయాణికులు గాయపడ్డారు

బ్రేకులు ఫెయిలై..కొండను ఢీకొట్టిన  ఆర్టీసీ బస్సు
apbus

  • డ్రైవర్‌సహా 18 మందికి గాయాలు

  • డ్రైవర్‌ సమయస్ఫూర్తితో తప్పిన ప్రాణనష్టం

కొయ్యూరు (అల్లూరి జిల్లా), నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలై కొండను ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్‌, కండక్టర్లు సహా 18 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వివరాలివీ.. కొయ్యూరు మండలం రేవళ్లు నుంచి ఆర్టీసీ బస్సు ఆదివారం ఉదయం నర్సీపట్నం బయలుదేరింది. చింతాలమ్మఘాట్‌ దిగుతుండగా రెండో మలు పులో బస్సు బ్రేకులు ఫెయిల్‌ అవ్వగా డ్రైవర్‌ ఐతంశెట్టి సత్తిబాబు.. చాకచక్యంగా వ్యవహరించి 3 మలుపుల వరకు దాటించా రు. బస్సు వేగం పెరిగి అదుపుతప్పుతుండడంతో బస్సు ఎడమవైపు లోయలోకి దూసుకుపోకుండా నియంత్రించడానికి.. కుడివైపు కొండను ఢీకొట్టారు. దీంతో బస్సు కుడివైపు భాగం నుజ్జున్జుయిపోయింది. ఆ సమయం లో బస్సులో 37 మంది ఉండగా.. డ్రైవర్‌తోపాటు కండక్టర్‌ ఈతంశెట్టి శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయాయి. మరో 16మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను బయటికి తీసి రాజేంద్రపాలెం పీహెచ్‌సీకి, తర్వాత నర్సీపట్నం ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!

Updated Date - Nov 30 , 2026 | 03:20 AM