ఏటీఎం చోరీ యత్నం కేసులో బాలుడి అరెస్ట్
ABN , Publish Date - Nov 29 , 2026 | 04:59 AM
ఏటీఎం చోరీ యత్నం కేసులో శనివారం ఓ బాలుడిని అరెస్ట్ చేసినట్లు అన్నమయ్య జిల్లా మదనపల్లె వన్‌టౌన్ సీఐ మోహన్‌కుమార్ చెప్పారు.
మదనపల్లె క్రైం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఏటీఎం చోరీ యత్నం కేసులో శనివారం ఓ బాలుడిని అరెస్ట్ చేసినట్లు అన్నమయ్య జిల్లా మదనపల్లె వన్‌టౌన్ సీఐ మోహన్‌కుమార్ చెప్పారు. ఆయన కథనం మేరకు.. మదనపల్లె పట్టణం నక్కలదిన్నెలో ఇటీవల ఇండియా ఏటీఎం కేంద్రంలోకి ముసుగు ధరించి ఉన్న ఓ దుండగుడు ప్రవేశించి చోరీకి యత్నించాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అదే ప్రాంతానికి చెందిన ఓ బాలుడు(15) పథకం ప్రకారం సమ్మెటతో ఏటీఎం యంత్రంలోకి ఇనుప మేకులు దింపి చోరీకి యత్నించినట్లు దర్యాప్తులో తేలింది. ఏటీఎం కేంద్రం వద్ద ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించి నేరానికి పాల్పడింది ఆ బాలుడేనని నిర్ధారించారు. అతడ్ని అరెస్ట్ చేసి, 41 నోటీసు ఇచ్చి విడుదల చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్ చెక్..