12 ఆస్పత్రులకు ‘స్వచ్ఛ ఆంధ్ర’ అవార్డులు
ABN , Publish Date - Oct 02 , 2026 | 05:22 AM
రాష్ట్రంలోని 12 ప్రభుత్వాసుపత్రులు స్వచ్ఛ ఆంధ్ర- 2026 రాష్ట్ర స్థాయి అవార్డులకు ఎంపికయ్యాయి. స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రుల్లో పరిశుభ్రతకు సంబంధించిన అంశాలపై నిర్వహించిన పరిశీలనలో..
నేడు సీఎం చేతుల మీదుగా ప్రదానం
అమరావతి, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 12 ప్రభుత్వాసుపత్రులు స్వచ్ఛ ఆంధ్ర- 2026 రాష్ట్ర స్థాయి అవార్డులకు ఎంపికయ్యాయి. స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రుల్లో పరిశుభ్రతకు సంబంధించిన అంశాలపై నిర్వహించిన పరిశీలనలో.. కృష్ణా జిల్లాలోని కనుమోలు, ఎన్టీఆర్ జిల్లాలోని కొణకంచి, అనకాపల్లిలోని ఆయుష్ తదితర వైద్యశాలలు ఉన్నాయి. గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో నిర్వహించే కార్యక్రమంలో ఈ అవార్డులను సీఎం చంద్రబాబు చేతులమీదుగా అందజేయనున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు