Share News

చొక్కా పైకి మడిచాం... జగన్‌కు చెక్‌ పెట్టేందుకే వచ్చాం

ABN , Publish Date - Oct 29 , 2026 | 04:38 AM

జగన్‌ హయాంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడులను ప్రజలు ఎన్నటికీ మరచిపోరని పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్‌ రవి అన్నారు.

చొక్కా పైకి మడిచాం... జగన్‌కు చెక్‌ పెట్టేందుకే వచ్చాం

  • అభ్యర్థులు లేకే నామినేషన్లు వేయలేకపోయారు

  • బీటెక్‌ రవి, ఆదినారాయణరెడ్డి

పులివెందుల, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): జగన్‌ హయాంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడులను ప్రజలు ఎన్నటికీ మరచిపోరని పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్‌ రవి అన్నారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మంగళవారం పులివెందులలో మాట్లాడుతూ, ‘చొక్కా మడతపెట్టాం.. ఎవరొస్తారో రండి’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం పులివెందుల పూలంగళ్ల సర్కిల్‌ వద్ద టీడీపీ కార్యకర్తలతో బహిరంగ సభ నిర్వహించారు. బీటెక్‌ రవి మాట్లాడుతూ.. ‘ఐదేళ్ల ప్రశాంతమైన జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు మాపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం? మీకు అభ్యర్థులు కరువై నామినేషన్లు వేయలేకపోయారు.

దానికీ, మాకు ఏం సంబంధం? జగన్‌ హయాంలో అరెస్టులు, వేధింపులు, దాడులు చేశారు. జగన్‌ మాటలకు సమాధానం చెప్పే సమయం వచ్చినపుడు చేతలతోనే సమాధానం చెబుతాం. మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలి’ అని పిలుపునిచ్చారు. అనంతరం జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ... ‘పులివెందులలో జగన్‌ పేదలకు ఒక్క ఇల్లు అయినా కట్టాడా? జగన్‌కు మాత్రం 5 ఇళ్లు ఉన్నాయి. జగన్‌రెడ్డి చొక్కా మోచేతి కిందికి మడిచాడు. మేము మోచేతి పైకి మడిచాం. ఆయనకు చెక్‌ పెట్టడానికి వచ్చాం. సొంత చిన్నాయన వివేకానందరెడ్డిని చంపిన కేసులో 8వ ముద్దాయిగా ఎంపీ అవినాశ్‌రెడ్డి, 7వ ముద్దాయిగా వైఎస్‌ భాస్కర్‌రెడ్డి ఉన్నారు. ఇది గుండెపోటు-1 కథ.’ అన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

పోటాపోటీ

ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట

Updated Date - Oct 29 , 2026 | 04:38 AM