Share News

రేపే నింగిలోకి జీఎస్ఎల్వీ-ఎఫ్‌18 రాకెట్‌

ABN , Publish Date - Oct 29 , 2026 | 04:52 AM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఈ నెల 30న జీఎస్ఎల్వీ-ఎఫ్‌18 రాకెట్‌ ప్రయో గం చేపట్టేందుకు శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు.

రేపే నింగిలోకి జీఎస్ఎల్వీ-ఎఫ్‌18 రాకెట్‌

  • ఎన్‌వీఎస్-03 ఉపగ్రహంతో కక్ష్యలోకి

  • నేడు కౌంట్‌డౌన్‌ ప్రారంభం

  • షార్‌కు చేరుకున్న ఇస్రో చైర్మన్‌

సూళ్లూరుపేట, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఈ నెల 30న జీఎస్ఎల్వీ-ఎఫ్‌18 రాకెట్‌ ప్రయో గం చేపట్టేందుకు శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. ఈ రాకెట్‌ ద్వారా నావిగేషన్‌ సేవలకు సంబంధించిన ఎన్‌వీఎస్-03 రెండో తరం ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనున్నారు. ప్రయోగానికి సంబంధించిన మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ (ఎంఆర్‌ఆర్‌) సమావేశం బుధవారం షార్‌లో జరిగింది. షార్‌ డైరెక్టర్‌ ముత్తచెళియన్‌తో పాటు సీనియర్‌ శాస్త్రవేత్తలు సమావేశమై ప్రయోగంపై సుదీర్ఘంగా చర్చించారు.

ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ గురువారం రాత్రి 11.51 గంటలకు ప్రారంభించనున్నారు. 24 గంటల కౌంట్‌డౌన్‌ పూర్తయ్యాక షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి శుక్రవారం రాత్రి 11.51 గంటలకు ఎన్‌వీఎ్‌స-03 ఉపగ్రహాన్ని తీసుకుని జీఎస్ఎల్వీ-ఎఫ్‌18 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రయోగ నేపథ్యంలో ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణ బుధవారమే షార్‌కు చేరుకుని శాస్త్రవేత్తలతో కలిసి ప్రయోగ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు షార్‌ నుంచి 19 జీఎస్ఎల్వీ రాకెట్‌లు ప్రయోగించగా.. ఇది 20వ ప్రయోగం.

ఈ వార్తలనూ చదవండి:

పోటాపోటీ

ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట

Updated Date - Oct 29 , 2026 | 04:52 AM