Kanaka Durga Temple: సంప్రదాయ దుస్తులు ధరిస్తేనే దర్శనం
ABN, Publish Date - Aug 30 , 2025 | 07:22 PM
విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తుల కోసం ఆలయ అధికారులు కొత్త నిబంధనలు జారీ చేశారు. ఆలయ పవిత్రతను కాపాడే లక్ష్యంతో డ్రెస్ కోడ్ అమలు చేశారు.
విజయవాడ: కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తుల కోసం ఆలయ అధికారులు కొత్త నిబంధనలు జారీ చేశారు. ఆలయ పవిత్రతను కాపాడే లక్ష్యంతో డ్రెస్ కోడ్ అమలు చేశారు. మహిళలు చీర, అమ్మాయిలు చుడీదార్, పురుషులు పంచ కండువతో రావాలని రూల్స్ పెట్టారు. అలాగే, ఆలయంలోకి సెల్‌ఫోన్లను పూర్తిగా నిషేధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఆలయ ఈఓ వీకే శీనా నాయక్ అధికారికంగా వెల్లడించారు.
Updated at - Aug 30 , 2025 | 07:22 PM