SLBC Tunnel Issue: వారు క్షేమమేనా.. క్షణం క్షణం ఉత్కంఠ..

ABN, Publish Date - Feb 25 , 2025 | 07:37 PM

SLBC Tunnel Issue: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కున్న ఆ ఎనిమిది మంది కార్మికులు క్షేమమేనా.. వారిని బయటకు తీసుకువచ్చేందుకు చేపట్టిన ప్రయత్నాలు ఎంత వరకు సఫలమయ్యాయి.. నేవీ స్పెషల్ టీమ్ ఎప్పుడు వస్తుంది.. వారిని ఎప్పుడు బయటకు తీస్తుంది.. స్పెషల్ స్టోరీ మీకోసం..

హైదరాబాద్, ఫిబ్రవరి 25: ఎస్‌ఎల్‌బీసీ ఘటన క్షణం క్షణం ఉత్కంఠ రేపుతోంది. అందులో చిక్కుకున్న 8 మంది క్షేమంగా బయటకు రావాలని యావత్ సమాజం ఆకాంక్షిస్తోంది. అయితే, పరిస్థితులు మాత్రం పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. ఆ ఎనిమిది మందిని కాపాడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సఫలమవుతాయా.. లేదా.. అనేది ఉత్కంఠ రేపుతోంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టన్నెల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదం జరిగిన సొరంగం వద్ద 11 బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇండియన్ నేవీ స్పెషల్ బృందాన్ని సైతం రంగంలోకి దింపుతామని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. ఈ స్పెషల్ నేవీ బృందం మంగళవారం రాత్రికి చేరుకునే అవకాశం ఉంది. బుధవారం ఉదయం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించనున్నారు. సీఎం ఆదేశాలతో ప్రమాద స్థలికి చేరుకునేందుకు ఇతర మార్గాలను సైతం అన్వేషిస్తున్నారు. మరోవైపు సొరంగంలో గంట గంటకు నీరు పెరిగిపోతోంది. సహాయ చర్యలు రిస్క్‌తో కూడినవి కావడంతో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Updated at - Feb 25 , 2025 | 07:37 PM