Sangareddy Kidnapping Case: మనవడిని కిడ్నాప్ చేసిన తాత
ABN, Publish Date - Oct 10 , 2025 | 12:10 PM
సంగారెడ్డి జిల్లాలో బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. తాత బాబురావు మనవడిని కిడ్నాప్ చేయించి..
సంగారెడ్డి జిల్లా: 8 ఏళ్ల క్రితం రాయికోడ్‌కు చెందన పద్మకు కర్నాటకకు చెందిన అర్జున్‌తో వివాహం జరిగింది. వీరికి ఐదుగురు ఆడ పిల్లలు, ఒక కొడుకు పవన్. అయితే, ఇరు కుటుంబాల మధ్య కొంతకాలంగా ఆర్థిక వివాదాలు నెలకొన్నాయి. దీంతో సునీల్, రవి అనే ఇద్దరు వ్యక్తులతో కలిసి తాత బాబురావు మనవడు పవన్‌ను కిడ్నాప్ చేయించాడు. కర్నాటకకు వెళ్లి విచారించిన పోలీసులు.. నిందితుల్ని అరెస్ట్ చేసి పవన్‌ను తల్లికి అప్పగించారు.
Updated at - Oct 10 , 2025 | 12:19 PM