PM Modi on H1-B Visa: విదేశాలపై ఆధారపడకండి..

ABN, Publish Date - Sep 20 , 2025 | 07:06 PM

H1-B వీసాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాలపై ఆధారపడొద్దని ఎప్పటి నుంచో చెబుతున్నామన్నారు. ఇతర దేశాలపై ఆధారపడటమే అన్నింటికన్నా పెద్ద శత్రువు అని పేర్కొన్నారు.

ఇంటర్నెట్ డెస్క్: H1-B వీసాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాలపై ఆధారపడొద్దని ఎప్పటి నుంచో చెబుతున్నామన్నారు. ఇతర దేశాలపై ఆధారపడటమే అన్నింటికన్నా పెద్ద శత్రువు అని పేర్కొన్నారు. మనమంతా కలిసి ఈ శత్రువును జయించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. విదేశాలపై మనం ఎంతగా ఆధారపడితే మనదేశం అంతలా విఫలమవుతుందని, అందరం కలిసి ప్రపంచంలోనే భారత్‌ను బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చాలని పిలుపినిచ్చారు. ఇతరులతో కలిసి నడుద్దాం కానీ.. ఆత్మాభిమానంతో బతుకుదామన్నారు. 140 కోట్ల మంది భవిష్యత్తును ఇతర దేశాల మీద వదిలేయబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

Updated at - Sep 21 , 2025 | 12:35 AM