Drunk and Drive Test : బీ కేర్ ఫుల్.. ఎనీ టైం.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు..
ABN, Publish Date - Jul 13 , 2025 | 03:02 PM
హైదరాబాద్‌లో మందుబాబులకు పోలీసులు గట్టి షాక్ ఇవ్వనున్నారు. నగరంలో ఎక్కడపడితే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తామని హెచ్చరించారు.
హైదరాబాద్ : హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు డేలో సైతం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహించబోతున్నారు. ఇకపై రాత్రుళ్లు మాత్రమే కాదు.. పట్టపగలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఎనీ టైం.. ఎనీ వేర్.. ఎనీ ప్లేస్.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు జరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. బ్రీత్ ఎనలైజర్ టెస్టులో 30 ఎంజీ కంటే ఎక్కువ మోతాదులో మద్యం ఉన్నా చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
Updated at - Jul 13 , 2025 | 04:55 PM