బోరుగడ్డ అనిల్ సెల్ఫీ వీడియో.. ఏం చెప్పాడంటే..
ABN, Publish Date - Mar 08 , 2025 | 06:16 PM
కూటమి ప్రభుత్వం తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ వైసీపీ సానుభూతిపరుడు బోరుగడ్డు అనిల్ కుమార్ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. దళితుడినైన తనను కర్నూలు పోలీసులు చిత్రహింసలు పెట్టి థర్డ్ డిగ్రీ ఉపయోగించారని చెప్పుకొచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: కూటమి ప్రభుత్వం తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ వైసీపీ సానుభూతిపరుడు బోరుగడ్డు అనిల్ కుమార్ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. దళితుడినైన తనను కర్నూలు పోలీసులు చిత్రహింసలు పెట్టి థర్డ్ డిగ్రీ ఉపయోగించారని చెప్పుకొచ్చాడు. దాన్ని వల్ల తన వెన్నుపూసకు గాయమైందని పేర్కొన్నాడు. బూతుకాలుతో తన్నడం వల్ల చెప్పలేని ప్రాంతంలో రక్తం గడ్డకట్టిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. మార్చి 1న హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇస్తే 3న రిలీజ్ అయ్యాయని, అయితే బెయిల్ రాకుండా అనేక మంది కుట్రలు చేశారని చెప్పాడు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ వల్ల తనకు ప్రాణహాని ఉందని చెప్పుకొచ్చాడు. మరోవైపు కూటమి నేతలపై బోరుగడ్డ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడంటూ తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Posani Krishna Murali: పోసానికి షాక్ ఇచ్చిన విజయవాడ కోర్టు.. మరో కేసులో..
Lalit Modi: మరోసారి హాట్ టాపిక్‍గా మారిన లలిత్ మోదీ.. ఈసారి ఎందుకంటే..
Updated at - Mar 08 , 2025 | 06:17 PM