కోర్టులో బాంబు కలకలం.. ముమ్మర తనిఖీలు

ABN, First Publish Date - 2025-04-04T15:07:11+05:30 IST

Bomb Scare: వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే బాంబ్ స్క్వాడ్ అక్కడకు చేరుకుని ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.

వరంగల్, ఏప్రిల్ 4: వరంగల్ జిల్లా (Warangal District) కోర్టులో బాంబు (Bomb Scare) కలకలం రేగింది. జిల్లా జడ్జికి బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ పంపాడు. దీంతో వెంటనే బాంబ్ స్క్వాడ్ అక్కడకు చేరుకుంది. కోర్టు ప్రాంగణంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది. జిల్లా కోర్టులోని మూడవ ఫ్లోర్‌లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది. ఈరోజు ఉదయం 9 గంటలకు జడ్జికి మూడు సార్లు ఆగంతకులు కాల్‌ చేసినట్లు తెలుస్తోంది. జడ్జి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో జడ్జి‌కు మెయిల్ పెట్టారు. జిల్లా కోర్టులో బాంబు పెట్టామని, ఏ క్షణమైనా అది పేలిపోవచ్చని ఆగంతకులు మెయిల్ చేయడంతో పాటు ఇంటర్నెట్ కాల్స్ చేశారు. పదే పదే కాల్స్ వస్తుండటంతో న్యాయాధికారులు సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


వెంటనే అప్రమత్తైన పోలీసులు.. డాగ్ స్క్వాడ్‌, బాంబ్‌ స్క్వాడ్‌ను అక్కడకు పంపించి తనిఖీలు చేయించారు. జిల్లా కోర్టులో ప్రతీ అనువణువును కూడా తనిఖీలు చేపట్టారు. అయితే ఎక్కడా కూడా బాంబు ఉన్నవాళ్లు గుర్తించలేదు. ఇదంతా కూడా ఆగంతకులు కావాలనే తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి

Pharmacist Death: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మసిస్ట్ కన్నుమూత

Crime On Train Washroom: ట్రైన్ వాష్‌రూమ్‌లో బాలికపై దారుణం

Read Latest Telangana News And Telugu News

Updated at - 2025-04-04T16:32:23+05:30