స్థానిక ఎన్నికలపై హైకోర్టు తీర్పు..
ABN, Publish Date - Jun 25 , 2025 | 09:22 AM
High Court: స్థానిక సంస్థలకు గత ఏడాదిన్నర కాలంగా తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదంటూ దాఖలైన ఆరు పిటిషన్లపై హైకోర్టు బుధవారం తీర్పు ఇవ్వనుంది.
Hyderabad: స్థానిక సంస్థలకు గత ఏడాదిన్నర కాలంగా తెలంగాణ ప్రభుత్వం (Telangana government) ఎన్నికలు (Local Elections) నిర్వహించడం లేదంటూ దాఖలైన ఆరు పిటిషన్లపై హైకోర్టు (High Court) బుధవారం తీర్పు ఇవ్వనుంది. ఈ పిటిషన్లపై ఇప్పటికే హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. వాటిపై న్యాయమూర్తి జస్టిస్ టి.మాధవి దేవి తీర్పు ఇవ్వనున్నారు.
కాగా స్థానిక సంస్థల ఎన్నికల పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఎన్నికల నిర్వహణకు సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. పిటీషనర్లు, ప్రభుత్వం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇవి కూడా చదవండి:
సర్వేయర్ హత్య కేసు.. ఇంకా చిక్కని ప్రధాన నిందితుడు..
For More AP News and Telugu News
Updated at - Jun 25 , 2025 | 09:22 AM