తెలంగాణ మద్యం షాపుల టెండర్లపై హైకోర్టులో విచారణ

ABN, Publish Date - Oct 23 , 2025 | 09:25 PM

మద్యం దుకాణాల టెండర్లపై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. మద్యం టెండర్లకు గడువు పొడిగించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

మద్యం దుకాణాల టెండర్లపై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. మద్యం టెండర్లకు గడువు పొడిగించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నెల 18 తర్వాత వేసిన టెండర్లను పరిగణలోకి తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్లు కోరారు. హైకోర్డు రేపు విచారణ జరుపుతామని తెలిపింది. కాగా, తెలంగాణ రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల గడువు నేటితో గియనుంది. మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఇప్పటికే దాదాపు 90 వేలకు పైగా దరఖాస్తులు అందినట్లుగా ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు.


ఇవి చదవండి

ద్వారకా తిరుమలలో చోరీలకు పాల్పడుతున్న మహిళ అరెస్ట్..

బాధ్యత లేకుండా ప్రవర్తించే వారిని ఉపేక్షించం.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Updated at - Oct 23 , 2025 | 09:50 PM