విజయ్‍పై పోలీసులకు ఫిర్యాదు..

ABN, Publish Date - Mar 13 , 2025 | 06:18 PM

ఇటీవల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్.. చెన్నై రాయపేట్టా వైఎంసీఏ గ్రౌండ్స్‍లో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలకు భోజనం ఏర్పాటు చేశారు.

చెన్నై: కోలీవుడ్ హీరో, తమిళగ వెట్రి కజగమ్(Tamilaga Vettri Kazhagam) పార్టీ అధ్యక్షుడు విజయ్ (Vijay) ఇచ్చిన ఇఫ్తార్ విందు (Iftar) వివాదాస్పదం అయ్యింది. ఇఫ్తార్ విందును అవమానించారంటూ సున్నత్ జమాత్ అనే ముస్లిం సంఘం ప్రతినిధులు చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఇటీవల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్.. చెన్నై రాయపేట్టా వైఎంసీఏ గ్రౌండ్స్‍లో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలకు భోజనం ఏర్పాటు చేశారు. ఉపవాసం ముగించే సమయంలో విజయ్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. అయితే ఈ విందులో కొందరు తాగుబోతులు, ఉపవాసం లేని వారు పాల్గొన్నారంటూ సున్నత్ జమాత్ ముస్లిం సంఘం ప్రతినిధులు ఆగ్రహించారు. ఈ మేరకు ఫిర్యాదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Guntur: గుంటూరు జైలు వద్ద హైడ్రామా.. రెచ్చినపోయిన అంబటి రాంబాబు అనుచరులు..

Fish and Mutton prices: బర్డ్ ఫ్లూ దెబ్బకు కొండెక్కిన మటన్, చేపల రేట్లు.. పరిస్థితి ఎలా ఉందంటే..

Chicken Tikka masala Cake: మీరెప్పుడైనా చికెన్ టిక్కా మసాలా కేక్ తిన్నారా.. అయితే మీ కోసమే..

Updated at - Mar 13 , 2025 | 06:18 PM