సైఫ్ పై అందుకే దాడి చేశా..నిందితుడి స్టేట్‌మెంట్
ABN, Publish Date - Jan 19 , 2025 | 09:35 PM
బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు షరీఫుల్ ఇస్లాం షహజయాద్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి అతడిని థానేలో పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అతడు బంగ్లాదేశ్ వాసిగా గుర్తించారు. భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన షహజయాద్.. ఇక్కడ విజయ్ దాస్‌గా పేరు మార్చుకొన్నాడు.
బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు షరీఫుల్ ఇస్లాం షహజయాద్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి అతడిని థానేలో పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అతడు బంగ్లాదేశ్ వాసిగా గుర్తించారు. భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన షహజయాద్.. ఇక్కడ విజయ్ దాస్‌గా పేరు మార్చుకొన్నాడు. రకరకాల పేర్లతో అతడు తిరుగుతోన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆరు నెలల క్రితం అతడు ముంబై వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పని చేస్తున్నాడు. దొంగతనం చేసేందుకే సైఫ్ ఇంట్లోకి విజయ్ దాస్ చొరబడినట్లు పోలీసులు వెల్లడించారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jan 19 , 2025 | 09:49 PM