అఫ్జల్ గంజ్ కాల్పుల కేసులో దోపిడీ దొంగలు అరెస్ట్

ABN, Publish Date - Jan 19 , 2025 | 02:26 PM

హైదరాబాద్‌లో కాల్పులు జరిపి తప్పించుకున్న దోపిడి దొంగలను పోలీసులు పట్టుకున్నట్లు విశ్వాసనీయ సమాచారం. కాల్పుల అనంతరం దొంగలు అఫ్జల్‌గంజ్‌లో ఆటో ఎక్కి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ వైపు పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు ఆమార్గంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీలను, సాంకేతిక ఆధారాలను సేకరించారు.

హైదరాబాద్‌లో కాల్పులు జరిపి తప్పించుకున్న దోపిడి దొంగలను పోలీసులు పట్టుకున్నట్లు విశ్వాసనీయ సమాచారం. కాల్పుల అనంతరం దొంగలు అఫ్జల్‌గంజ్‌లో ఆటో ఎక్కి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ వైపు పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు ఆమార్గంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీలను, సాంకేతిక ఆధారాలను సేకరించారు. దొంగలు ఆరోజు రాత్రి 8 గంటలకు రైల్వే స్టేషన్ పరిసరాల్లో తిరిగినట్లు ఆధారాలు లభించాయి. ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా వారు ఎక్కడ దిగారు. ఏం మాట్లాడుకున్నారు.


ఏటువెళ్లారనే పలు కీలక విషయాలు తెలిసినట్లు సమాచారం. దోపిడీ దొంగలు బీహార్‌కు చెందిన అమిత్ కుమార్, అనిశ్ గ్యాంగ్‌గా ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు ఆ ముఠా బీదర్‌తో పాటు ఛత్తీస్‌గఢ్‌లో కూడా బ్యాంకుల్లో రూ. 10 లక్షలు దోచుకుని పరారైనట్లు గుర్తించారు. ముఠాలో ఎంతమంది ఉన్నారు. వారి కార్యకలాపాలపైరహాస్య ప్రదేశంలో విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు. కర్ణాటకలోని బీదర్‌లో సెక్యూరిటీ గార్డులపై కాల్పులు జరిపి.. ఆ ఏటీఎంలో జమ చేయాల్సిన రూ. 93 లక్షలతో పరారైన దోపీడీ దొంగలు హైదరాబాద్‌కు చేరుకోవడం, ఓ ట్రావెల్స్‌కు చెందిన ఉద్యోగి జహంగీర్‌పై కాల్పులు జరిపారు. అయితే నిందితులను పోలీసులు విచారిస్తుండటంతో మరికొన్ని విషయాలు తెలిసే అవకాశాలున్నాయి.

Updated at - Jan 19 , 2025 | 02:26 PM