దుబాయ్‍లో బంగారం ఎందుకు చీపో తెలుసా..
ABN, Publish Date - Mar 10 , 2025 | 08:29 PM
బంగారం అక్రమ రవాణా కేసులో నటి రన్యారావు అరెస్టయిన తర్వాత దుబాయ్‍పై పెద్దఎత్తున చర్చ మెుదలైంది. దుబాయ్‍లో బంగారం ధరలు తక్కువగా ఉంటాయా?, దీనికి కారణమేంటనే విషయాలపై చర్చ జరుగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: బంగారం అక్రమ రవాణా కేసులో నటి రన్యారావు అరెస్టయిన తర్వాత దుబాయ్‍పై పెద్దఎత్తున చర్చ మెుదలైంది. దుబాయ్‍లో బంగారం ధరలు తక్కువగా ఉంటాయా?, దీనికి కారణమేంటనే విషయాలపై చర్చ జరుగుతోంది. పసిడి వాణిజ్యానికి ఆ దేశం ఎప్పట్నుంచో కేంద్రంగా ఉంది. భారత్‍తో పోలిస్తే దుబాయ్‍లో గోల్డ్ ధరలు చాలా తక్కువగా ఉంటాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. బంగారం కొనుగోళ్లపై అక్కడి ప్రభుత్వం ఎలాంటి పన్నులూ విధించదు. దీంతో అక్కడ మార్కెట్ ధరలకే పసిడి కొనుక్కోవచ్చు. అలాగే గోల్డ్ దిగుమతులపైనా ఆ దేశం ఎలాంటి సుంకాలు వసూలు చేయదు. దీంతో గోల్డ్ ధర మరింత తగ్గుతుంది. మరోవైపు మార్కెట్లో పోటీ కారణంగా వినియోగదారులకు వ్యాపారులు తక్కువ ధరకే బంగారాన్ని విక్రయిస్తుంటారు. అందుకే వివిధ దేశాలకు చెందిన ప్రజలు దుబాయ్‍లో బంగారం కొనుగోలు చేసి స్వదేశాలకు తీసుకెళ్తుంటారు.
ఈ వార్తలు కూడా చదవండి:
AP News: రాజధానిలో భూకేటాయింపులపై మంత్రుల కమిటీ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే..
Deveineni Uma Maheswara Rao: టీడీపీ ఆ విషయం మరోసారి రుజువు చేసింది: దేవినేని ఉమా..
Updated at - Mar 10 , 2025 | 08:29 PM