ఏపీకి ప్రధాని మోదీ.. ఏయే పనులు ప్రారంభిస్తారంటే..

ABN, Publish Date - Oct 15 , 2025 | 09:41 PM

ప్రధాని నరేంద్ర మోదీ గురువారం నాడు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. కర్నూలులో రూ.13,400 కోట్ల విలువైన పనులకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు.

కర్నూలు: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం నాడు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. కర్నూలులో రూ.13,400 కోట్ల విలువైన పనులకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ పనుల్లో విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, పరిశ్రమలు, రక్షణతోపాటు మరిన్ని రంగాలకు చెందినవి ఉన్నాయి. రూ.2,280కోట్లతో నిర్మించిన విద్యుత్ ప్రసార వ్యవస్థతోపాటు రూ.4,920 కోట్లతో ఓర్వకల్లు కొపర్తి ఇండ్రస్టియల్ పారిశ్రామిక పార్కుకు శంకుస్థాపన చేస్తారు. అలాగే రూ.1200 కోట్లతో చేపట్టిన వివిధ జాతీయ రైల్వే ప్రాజెక్టులను ప్రారంభిస్తారు ప్రధాని మోదీ.


ఈ వార్తలు కూడా చదవండి...

జర్నలిజం విలువల పరిరక్షణలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముందుంది: సీఎం చంద్రబాబు

ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

Read Latest AP News And Telugu News

Updated at - Oct 15 , 2025 | 09:56 PM