బడ్జెట్‌లో AIకి రూ.500 కోట్లు.. అసలు విషయం ఇదే..

ABN, Publish Date - Feb 02 , 2025 | 01:27 PM

ఢిల్లీ: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌(Artificial Intelligence)పై ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) సర్కార్ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) 2025-26 బడ్జెట్‌లో దానిపై కీలక ప్రకటనలు చేశారు.

ఢిల్లీ: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ (Artificial Intelligence)పై ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) సర్కార్ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) 2025-26 బడ్జెట్‌లో దానిపై కీలక ప్రకటనలు చేశారు. ఏఐ కోసం భారీగా నిధులు కేటాయించడంతోపాటు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు నూతన బడ్జెట్ ప్రసంగంలో నిర్మల కీలక విషయాలు వెల్లడించారు. ఏఐతో భారతదేశ సాంకేతిక, విద్య, పర్యావరణ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు రూ.500 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఏఐలో మూడు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Updated at - Feb 02 , 2025 | 01:27 PM