నయీం ఫ్యామిలీపై కోర్టుకు ఈడీ
ABN, First Publish Date - 2025-04-12T12:31:32+05:30 IST
Nayeem Family ED Case: నయీం ఆస్తుల వ్యవహారానికి సంబంధించి ఓ వైపు ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. మరోవైపు ఈ కేసులో 35 ఆస్తులను నయీం కూడబెట్టారనే అంశాన్ని ఇప్పటికే గుర్తించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 12: గ్యాంగ్‌స్టర్ నయీం కుటుంబసభ్యులపై నాన్ బెయిలబుల్ వారెంట్‌లు జారీ చేయాలని కోర్టును ఈడీ (Enforcement Directorate) కోరింది. పలువురి దగ్గర నుంచి బలవంతంగా లాక్కున్న భూములను నయీం కుటుంబసభ్యుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాడని ఈడీ తేల్చింది. చాలా సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ నయీం కుటుంబ సభ్యులు స్పందించలేదని కోర్టుకు ఈడీ తెలిపింది. ఇప్పటికే 35 ఆస్తులు జప్తు చేసేందుకు ఈడీ సిద్ధమైంది. నయీం ఆస్తుల వ్యవహారానికి సంబంధించి ఓ వైపు ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. మరోవైపు ఈ కేసులో 35 ఆస్తులను నయీం కూడబెట్టారనే అంశాన్ని ఇప్పటికే గుర్తించారు.
దీనిపై గతంలో నయీం కుటుంబసభ్యులకు నాన్‌బెయిలబుల్ వారెంట్‌లు జారీ చేసినా, నోటీసులు ఇచ్చినా స్పందించలేదని, విచారణకు రాలేదని న్యాయస్థానికి చెప్పింది. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
Vanajeevi Ramaiah: పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత .. ప్రముఖుల సంతాపం
Tirumala Temple Incident: తిరుమలలో అపచారం.. ఏం జరిగిందంటే
Read Latest AP News And Telugu News
Updated at - 2025-04-12T12:31:33+05:30