నేను కార్యకర్తనే..పవన్ అన్నే డిప్యూటీ సీఎం
ABN, Publish Date - Jan 27 , 2025 | 08:59 PM
డిప్యూటీ సీఎం పదవిపై ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. తాను టీడీపీ కార్యకర్తగానే పని చేస్తానని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ఏ బాధ్యత అప్పగించినా.. అహర్నిశలు కష్టపడి పని చేస్తానని తెలిపారు. పార్టీని బలోపేతం చేస్తానన్నారు. అంతేకానీ పార్టీకి చెడ్డ పేరు మాత్రం తీసుకు రానని ఆయన పేర్కొన్నారు.

తాను యువగళం పేరిట పాదయాత్ర చేశానని.. ఆ సమయంలో పార్టీకి ఏ చిన్న పాటి చెడ్డ పేరు కూడా తీసుకు రాలేదన్నారు. క్రమశిక్షణతో పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను నిర్వహిస్తానని.. అందుకు కట్టుబడి ఉంటానని చెప్పారు. రానున్న రోజుల్లో.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండకూడదని తాను భావిస్తున్నట్లు నారా లోకేష్ ఈ సందర్భంగా కుండ బద్దలు కొట్టారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jan 27 , 2025 | 08:59 PM