Hyderabad lift accident: బాబోయ్.. మరో లిఫ్ట్ ప్రమాదం
ABN, First Publish Date - 2025-04-07T15:51:47+05:30 IST
Hyderabad Lift Accident: హైదరాబాద్‌లో లిఫ్ట్ ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన ప్రమాదంలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇప్పుడు తాజాగా మరోసారి లిఫ్ట్ ప్రమాదం జరిగింది.
హైదరాబాద్, ఏప్రిల్ 7: నగరంలో మరో లిఫ్ట్ ప్రమాదం జరిగింది. ఆసిఫ్‌నగర్‌లో ఓ అపార్ట్‌మెంట్ ఐదో అంతస్థు నుంచి లిఫ్ట్ కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో లిఫ్ట్‌లో ఆరుగురు ఉన్నారు. ఈ మధ్యకాలంలో లిఫ్ట్ ప్రమాదాలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ పైకి వెళ్లి.. కిందకు వచ్చే క్రమంలో లిఫ్ట్ ఒక్కసారిగా పట్టు కోల్పోయి కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో పడింది. ప్రమాద సమయంలో లిఫ్ట్‌లో ఆరు మంది ఉన్నారు. ఇందులో ముగ్గురు చిన్నారులు, ముగ్గురు పెద్దవారు ఉన్నారు. అయితే లిఫ్ట్‌లో ఉన్న ముగ్గురు పెద్దవారు గాయపడ్డారు.
చిన్నారులు మాత్రం ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లిఫ్ట్ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Bengaluru: కామంతో కళ్లు మూసుకుపోయి.. నడి రోడ్డు మీద
Medchal Crime News: రైల్వేస్టేషన్ వద్ద యువతిపై కీచకుల అఘాయిత్యం... చివరకు
Read Latest Telangana News And Telugu News
Updated at - 2025-04-07T15:51:49+05:30