నా తప్పు ఏమీ లేదు: పేర్ని జయసుధ

ABN, Publish Date - Jan 03 , 2025 | 10:57 AM

కృష్ణా జిల్లా: పేదల బియ్యాన్ని స్వాహా చేసి అడ్డంగా దొరికి పోయిన మాజీ మంత్రి పేర్ని నాని తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఓ అమాయకుడిని బలి చేసేందుకు సిద్ధమయ్యారు. దీనికోసం ఆయన కుటుంబం బుకాయించేందుకు వెనుకాడలేదు.

కృష్ణా జిల్లా: పేదల బియ్యాన్ని స్వాహా చేసి అడ్డంగా దొరికి పోయిన మాజీ మంత్రి పేర్ని నాని తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఓ అమాయకుడిని బలి చేసేందుకు సిద్ధమయ్యారు. దీనికోసం ఆయన కుటుంబం బుకాయించేందుకు వెనుకాడలేదు. తమ గోదాములో బియ్యం మాయమైన కేసులో బుధవారం పోలీసు విచారణకు పేర్ని నాని సతీమణి జయసుధ హాజరైన విషయం తెలిసిందే. బియ్యం పక్కదారి పట్టిన ఉదంతంలో తమ తప్పు ఏమీ లేదని, తప్పంతా మేనేజర్‌దేనని ఆమె వాంగ్మూలం ఇచ్చారు. గోదాము మేనేజర్‌ విషయంలో ఆమె అబద్ధాలు చెప్పేందుకు ప్రయత్నం చేయగా.. పోలీసుల విచారణలో అసలు విషయాలు బయటపడ్డాయి.


బందరు మండలం పొట్లపాలెం గ్రామంలో ఎల్‌పీ నంబరు 89/2, 92/1లో పేర్ని కుటుంబ సభ్యులకు 11 ఎకరాల భూమి ఉంది. ఇందులో పేర్ని జయసుధ పేరు మీద 2.18 ఎకరాలు ఉండగా మిగిలిన భూమి ఆమె తల్లి సత్యనారాయణమ్మ పేరుతో ఉంది. ఇక్కడ పేర్ని నాని అత్త పేరుతో సత్య వేర్‌ హౌస్‌, పేర్ని జయసుధ పేరుతో జేఎస్‌ వేర్‌ హౌస్‌ గోదాములు నిర్మించారు. జయసుధ పేరుతో ఉన్న గోదామును పౌరసరఫరాల శాఖకు లీజుకు ఇచ్చారు. 2022లో గోదాముల నిర్మాణం పూర్తికాగా 2023 జనవరి 9న పౌరసరఫరాల శాఖతో లీజు ఒప్పందం చేసుకున్నారు. ఈ లీజు ఒప్పందంలో సాక్షిగా బేతపూడి మానస్‌ తేజ్‌, రావి ప్రత్యూష సంతకం చేశారు. 2023 జనవరి నుంచే మానస్‌ తేజ్‌ గోదాము మేనేజర్‌గా, ప్రత్యూష గోదాములో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. దానికి ఒప్పంద పత్రమే నిదర్శనం. కానీ బుధవారం నాటి పోలీసు విచారణలో పేర్ని జయసుధ తనకు ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆరు నెలల క్రితమే మానస్‌ తేజ్‌ను మేనేజర్‌గా నియమించామని చెప్పారు. అయితే మానస్‌ తేజ్‌ రెండేళ్లుగా మేనేజర్‌గా చేస్తున్నారంటూ పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. దానికి లీజు అగ్రిమెంట్‌ను రుజువుగా చూపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఒడిషా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు బాధ్యతలు

ఫార్ములా ఈ కార్ రేసు కేసు.. వారికి మళ్లీ ఈడీ పిలుపు

హైదరాబాద్‌కు వస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు..

వైజాగ్, విజయవాడకు డబుల్ డెక్కర్ మెట్రో..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jan 03 , 2025 | 10:57 AM