సీఐ బాత్రూం బకెట్‌లో రూ.3 లక్షలు.. ఫోన్ కాల్ వైరల్
ABN, Publish Date - Jan 23 , 2025 | 08:07 PM
Jammikunta CI Viral Audio: జమ్మికుంటలో ఫోన్ కాల్ ఆడియో ఒకటి వైరల్‌గా మారింది. ఓ సీఐ, మరో వ్యక్తికి సంబంధించి దాదాపు10 నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియో జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తనపై పెట్టిన అట్రాసిటీ కేసులో రూ.3 లక్షలు తీసుకుని కూడా ఎందుకు కేసు నమోదు చేశావంటూ సీఐని సదరు వ్యక్తి బెదిరించడం సంచలనంగా మారింది.
జమ్మికుంటలో ఫోన్ కాల్ ఆడియో ఒకటి వైరల్‌గా మారింది. ఓ సీఐ, మరో వ్యక్తికి సంబంధించి దాదాపు10 నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియో జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తనపై పెట్టిన అట్రాసిటీ కేసులో రూ.3 లక్షలు తీసుకుని కూడా ఎందుకు కేసు నమోదు చేశావంటూ సీఐని సదరు వ్యక్తి బెదిరించడం సంచలనంగా మారింది. కేసు విషయమైన తనను రక్షించాలని మీ వద్దకు వచ్చానని, మీరు చెప్పినట్లుగానే రూ.3 లక్షలు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ బాత్రూమ్‌లోని బకెట్‌లో పెట్టినట్లు ఆడియోలోని వ్యక్తి చెప్పారు. అయినా తనను రక్షించకుండా కేసు ఎందుకు నమోదు చేశావంటూ సీఐని సదరు వ్యక్తి సూటిగా ప్రశ్నించాడు.
బాత్రూమ్‌లో డబ్బులు పెట్టేటప్పుడు తాను వీడియో రికార్డు చేశానని, దాన్ని మీ ఉన్నతాధికారులు, మీడియాకు పంపిస్తానంటూ సీఐని అతడు హెచ్చరించాడు. కాపాడాలంటూ లక్షలు ఇచ్చినా కేసు పెట్టావంటూ సీఐతో అతడు ఫోన్‌లో వాగ్వాదానికి దిగాడు. సీఐ మాత్రం స్టేషన్‌కు రా.. అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందామంటూ నెమ్మది మాట్లాడుతోన్న ఆడియో ద్వారా తెలుస్తోంది. ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో తాజాగా బయట వచ్చింది. సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. మరోవైపు ఈ ఆడియో వ్యవహారం పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారంపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jan 23 , 2025 | 08:07 PM