కూటమి సర్కార్‌తోనే అది సాధ్యం: గంటా శ్రీనివాసరావు

ABN, Publish Date - Jan 17 , 2025 | 01:43 PM

విశాఖ: నూతన సంవత్సరంలో విశాఖకు సంబంధించి శుభవార్తలు వింటున్నామని, మొన్న విశాఖలో రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటానికి శాశ్వత పరిష్కార దొరికిందని భీమిలీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.

విశాఖ: నూతన సంవత్సరంలో విశాఖకు సంబంధించి శుభవార్తలు వింటున్నామని, మొన్న విశాఖలో రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటానికి శాశ్వత పరిష్కారం దొరికిందని భీమిలీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఉక్కు కర్మాగారానికి రూ.11 వేల 500 కోట్ల ప్యాకేజీ కేంద్రం ప్రకటించిందని అన్నారు. కూటమి ప్రభుత్వంతోనే అది సాధ్యమైందని, స్టీల్ ప్లాంట్ కోసం 32 మంది ప్రాణ త్యాగం చేశారని అన్నారు. స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత విశాఖ ఉక్కు నగరంగా పేరు సంపాదించిందన్నారు.

ఈ వార్త కూడా చదవండి..

ఈనెల 26వ తేదీ నుంచి రైతు భరోసా..


స్టీల్ ప్లాంట్ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవమని, అందుకే తాను 4 ఏళ్ల ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని గంటా శ్రీనివాసరావు తెలిపారు. ప్రైవేటీకరణ నిర్ణయం వచ్చిన తర్వాత అప్పటి సిఎం జగన్ స్టీల్ ప్లాంట్ శిబిరానికి, ప్లాంట్‌కు వెళ్ళలేదని, డిల్లీకి వెళ్లి మాట్లాడలేదని విమర్శించారు. జగన్ ఢిల్లీకి ఎప్పుడు వెళ్ళినా తన వ్యక్తి గత ప్రయోజనాలు కోసమే వెళ్ళేవారని ఆరోపించారు. సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కృషి వలనే ప్యాకేజ్ వచ్చిందని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తోందని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నంద్యాల విజయ డైరీ వద్ద ఉద్రిక్తత..

మావోయిస్టు నేత హిద్మా టార్గెట్‌గా భారీ సెర్చ్ ఆపరేషన్

ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక ఎన్నికల్లో పోటీకి అర్హత

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jan 17 , 2025 | 01:44 PM