బాబోయ్.. ఏంటీ చలి
ABN, Publish Date - Jan 04 , 2025 | 11:20 AM
Telangana: తెలంగాణను చలిపులి వణికిస్తోంది. పలు జిల్లాలో పది డిగ్రీలలోపు రాత్రి పూట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అక్కడ 6.5 డిగ్రీలు నమోదు కాగా.. ఇదే జిల్లా తిర్యానీ మండలంలో 6.6 డిగ్రీలు నమోదు అయ్యింది.
హైదరాబాద్, జనవరి 4: తెలంగాణలో (Tealngana State) చలి తీవ్రత మళ్లీ పెరుగుతోంది. మూడు రోజుల క్రితం వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు 14 నుంచి 20 డిగ్రీల మధ్య నమోదు కాగా.. తాజాగా అవి సగానికి పడిపోయాయి. పలు జిల్లాలో పది డిగ్రీలలోపు రాత్రి పూట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అక్కడ 6.5 డిగ్రీలు నమోదు కాగా.. ఇదే జిల్లా తిర్యానీ మండలంలో 6.6 డిగ్రీలు నమోదు అయ్యింది. అలాగే సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 6.9 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా బేలలో 7.1 డిగ్రీలు, భీమ్‌పూర్‌లో 7.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. వికారాబాద్ జిల్లా మోమిన్‌మేట్‌లో 7.3 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో 7.5 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా డోంగ్లీలో 8 డిగ్రీలు, నిర్మల్ జిల్లా పెంబీలో 8.5 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 15 జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు పది డిగ్రీల లోపు నమోదు కాగా.. మిగిలిన జిల్లాలో 13 డిగ్రీల లోపే రికార్డు అయ్యాయి. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది.
ఇవి కూడా చదవండి...
నాలుగో రోజు పెరిగిన బంగారం, వెండి ధరలు..
అత్యవసర ల్యాండింగైన ఇండిగో విమానం.. విషయం ఇదే..
Read Latest Telangana News And Telugu News
Updated at - Jan 04 , 2025 | 11:21 AM