పిల్లలను నరికి చంపిన కసాయి తల్లి

ABN, First Publish Date - 2025-04-18T16:26:31+05:30 IST

Hyderabad Crime: తనతో పాటు పిల్లలు కూడా తరచూ అనారోగ్యం బారిన పడటంతో ఆ తల్లి ఉన్మాదిగా మారిపోయింది. చివరకు కన్న బిడ్డలనే పొట్టనపెట్టుకుంది.

హైదరాబాద్, ఏప్రిల్ 18: నగరంలోని గాజులరామారంలో దారుణం జరిగింది. కన్న తల్లే కసాయిలా మారింది. ఇద్దరు బిడ్డలను పొట్టనపెట్టుకుంది. వేటకొడవలితో నిర్ధాక్షణ్యంగా నరికి చంపింది. ప్రాణాలను కాపాడుకునేందుకు పారిపోతున్న పిల్లలను వెంటాడి మరీ గొంతుకోసింది. అనంతరం తాను కూడా ప్రాణాలు తీసుకుంది. తేజస్విని కొన్నాళ్లుగా కంటి సమస్యతో బాధపడుతోంది. పెద్దకుమారుడు ఆశిష్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో ఇబ్బంది పడుతున్నాడు. ఏది తిన్నా వాంతులు చేసుకుంటున్నాడు. చిన్న కుమారుడైన హర్షిత్ కూడా అప్పడప్పుడు ఇదే సమస్య వస్తోంది. బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పెద్ద కుమారుడికి చికిత్స చేయిస్తోంది.


పిల్లల స్వస్థత కోసం గూగుల్‌ల్లోనూ వెతుకుతూ మందులు వాడుతోంది. తనతో పిల్లలు కూడా తరుచూ అనారోగ్యానికి గురవుతూ ఉండటాన్ని జీర్ణించుకోలేక ఆమె ఉన్మాదిగా మారి ఇద్దరు పిల్లలను చంపేసింది. అనంతరం భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.


ఇవి కూడా చదవండి

Summer Vacation Safety Tips: తస్మాత్ జాగ్రత్త.. పిల్లల సరదా ఆట విషాదం కావొద్దు

Cool Drink Incident: అసలేం తినేటట్టు లేదు.. తాగేట్టూ లేదుగా

Read Latest Telangana News And Telugu News

Updated at - 2025-04-18T16:26:32+05:30