మంచిర్యాలలో వింత.. బావిలో నుంచి వేడి నీళ్లు

ABN, Publish Date - Feb 02 , 2025 | 12:38 PM

మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలం, మాదాపూర్‌ వింత చోటు చేసుకుంది. గత ఐదు రోజులుగా ఆ బావిలో నుంచి వేడి నీళ్లు వస్తున్నాయి. దీంతో ఆ ఇంటి యజమాని ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ వింత ఘటనను చూసేందుకు గ్రామస్తులు భారీగా తరలి వస్తున్నారు. అసలే చలికాలం కావడంతో బకెట్లతో వేడి నీళ్లు తీసుకువెళుతున్నారు.

మంచిర్యాల: అసలే చలికాలం.. చల్లని నీటితో స్నానం చేయాలంటే ఇబ్బందిగా ఉంటుందా.. అయితే ఆ బావి దగ్గరకు వెళ్లండి.. కావలసినన్ని వేడి నీళ్లు. బావిలో వేడినీళ్లు ఏంటని అనుకుంటున్నారా.. మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలం, మాదాపూర్‌లోని ఓ ఇంటి ఆవరణలో ఉన్న బావి నుంచి వేడి నీళ్లే వస్తున్నాయి. మాదాపూర్ గ్రామానికి చెందిన మధుకర్ జీవన్ ఇంటి ఆవరణలో ఓ బావి ఉంది. దానిలోంచి ఐదు రోజులుగా వేడి నీళ్లే వస్తున్నాయి. విషయం తెలిసిన గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. స్నానాలు చేయడానికి బావిలో నీటిని తీసుకువెళుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

ఈ వార్త కూడా చదవండి..

రాత్రంతా అంబులెన్స్‌లోనే మృతదేహం


ఈ వార్తలు కూడా చదవండి..

ముద్రగడ నివాసంలో ఓ తాగుబోతు భీభత్సం

పాతబస్తీ, జీడిమెట్లలో అగ్ని ప్రమాదం..

మద్యం మత్తులో నల్లవాగులో పడి ఇద్దరు వ్యక్తుల మృతి..

తెలంగాణ కాంగ్రెస్ భారీ ధర్నా

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Feb 02 , 2025 | 12:38 PM