నగ్న వీడియోలతో బ్లాక్‌మెయిల్.. చివరకు
ABN, Publish Date - Feb 04 , 2025 | 03:17 PM
Hyderabad: నగ్న వీడియోాలతో యువతిని బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేస్తున్న యువతిని వీడియోలు చూపించి బెదిరిస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు హాస్టల్ నిర్వాహకుడు.
హైదరాబాద్, ఫిబ్రవరి 4: నగరంలో ఓ హాస్టల్ నిర్వాహకుడి అరాచకం వెలుగులోకి వచ్చింది. వీడియోలతో నిడదవోలుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై బెదిరింపులకు దిగి ఏకంగా రూ.2.50 కోట్లు వసూలు చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిడదవోలు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. గత ఆరు నెలల నుంచి హాస్టల్ నిర్వాహకుడు యువతిని వేధింపులకు గురిచేస్తున్నాడు. నిడదవోలుకు చెందిన యువతి హైదరాబాద్‌లోని (Hyderabad) హాస్టల్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో హాస్టల్ నిర్వహకుడు తరచూ యువతిని వేధింపులకు గురిచేశాడు.
యువతి నగ్న వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. దీంతో యువతి పలు దఫాలుగా రూ.2.50 కోట్లను ఇచ్చింది. అయితే నిందితుడి వేధింపులు ఎక్కువడంతో సొంతూరు నిడదవోలుకు వచ్చిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి దాదాపు కోటి ఎనిమిదిలక్షల ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అనేక విషయాలు కూడా బయటపడ్డాయి. ఎంతో మందిని నిందితుడు ఇలానే వేధింపులకు గురిచేశాడని విచారణలో తేలింది.
ఇవి కూడా చదవండి...
కుంభమేళాకు ప్రధాని మోదీ.. పవిత్ర స్నానంతోపాటు
Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే మరోసారి సంచలన వ్యాఖ్యలు
Read Latest Telangana News And Telugu News
Updated at - Feb 04 , 2025 | 03:19 PM