మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకుంటే ఏమవుతుందో తెలుసా?
ABN, Publish Date - Nov 29 , 2025 | 10:40 AM
మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందో అపోలో ఆస్పత్రి వైద్యురాలు కె.సంయుక్త తెలియజేశారు.
మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. చాలా మంది బిజీగా ఉంటూ లేదా తెలియని ప్రదేశంలో ఉన్నప్పుడు మూత్రాన్ని ఆపుకుంటారు. కానీ ఇదే అలవాటుగా మారితే మాత్రం ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవడం వల్ల ఏం జరుగుతుంది అనేది దానిపై సికింద్రాబాద్ అపోలో ఆస్పత్రి యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ కె. సంయుక్త వివరించారు. పెద్దలు మొదలు పిల్లల వరకు తరచూ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయని తెలిపారు.
ఒక్కో ఏజ్‌లో వివిధ కారణాల వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పారు. నీళ్లు సరిగ్గా తాగకపోవడం, ఎక్కువ సేపు యూరిన్‌ను ఆపుకోవడం, లేదా కిడ్నీలో స్టోన్స్ ఉంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని డాక్టర్ సంయుక్త వెల్లడించారు. యూరిన్ ఆపకోడానికి సంబంధించి డాక్టర్ చెప్పిన మరింత సమాచారాన్ని వీడియోలో వీక్షించండి.
ఇవి కూడా చదవండి...
ఎంత ప్రయత్నించినా ఉదయాన్నే నిద్ర లేవలేకపోతున్నారా? సైన్స్ ఏం చెప్పిందంటే..
జాగ్రత్త.. ఈ భాగాల్లో నొప్పిని సీరియస్‌గా తీసుకోండి!
Read Latest Health News And Telugu News
Updated at - Nov 29 , 2025 | 10:40 AM