ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా పదవీ బాధ్యతలు
ABN, Publish Date - Jan 31 , 2025 | 09:32 PM
ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సైబర్ క్రైమ్‌పై సైబర్ కమాండోలను తయారు చేస్తామన్నారు. అందుకోసం ఆరు నెలల పాటు వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. అదీ కూడా జాతీయ స్థాయిలో ఈ శిక్షణ ఉంటుందని చెప్పారు.
అమరావతి, జనవరి 31: ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సైబర్ క్రైమ్‌పై సైబర్ కమాండోలను తయారు చేస్తామన్నారు. అందుకోసం ఆరు నెలల పాటు వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. అదీ కూడా జాతీయ స్థాయిలో ఈ శిక్షణ ఉంటుందని చెప్పారు.
ఫోరెన్సిక్ ల్యాబ్‌తోపాటు అందుకు సంబంధించిన పరికరాలు సైతం ఉన్నాయని చెప్పారు. అయితే నాణ్యతతో కూడిన నివేదికలు ఎలా ఇవాలనే అంశంపై ప్రస్తుతం తాము పని చేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఉన్న సిహెచ్ ద్వారకాతిరుమల రావు పదవి కాలం ఈ రోజుతో ముగిసింది. దీంతో కొత్త డీజీపీ నియామకం అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఈ పోస్ట్ హరీష్ కుమార్ గుప్తాను వరించింది.
మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jan 31 , 2025 | 09:32 PM