పన్ను వసూళ్లపై GHMC దూకుడు..ఆస్తులు సీజ్

ABN, Publish Date - Feb 23 , 2025 | 09:18 PM

పన్ను వసూళ్ల విషయంలో జీహెచ్ఎంసీ దూకుడు పెంచింది. భారీ బకాయిల వసూళ్లపై దృష్టి సారించింది. చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలంటూ.. ఉన్నతాధికారుల ఆదేశాలతో జీహెచ్ఎంసీ రెవెన్యూ విభాగం స్పీడ్ పెంచింది. రెండు నెలల క్రితం నుంచి బిల్లులు చెల్లించాలంటూ చట్టం 1955, సెక్షన్ 368 ప్రకారం నోటీసులు జారీ చేస్తోంది. అందులోభాగంగా ఆస్తులు సీజ్ చేయడం..ఫర్నీచర్ ఇతరత్ర వస్తువులు తీసుకు వెళ్లడంపై దృష్టి సారించింది.

బంజారాహిల్స్‌లోని హోటల్‌కు సంబంధించి రూ. కోటీ 40 లక్షలు బకాయిలు ఉండగా.. సీజ్ చేశారు. స్పందించిన యజమానులు రూ. 51 లక్షలు చెల్లించి మిగతాదంతా వచ్చే మాసం మొదటి వారంలో చెల్లిస్తామని స్పష్టం చేశారని జూబ్లీహిల్స్ సర్కిల్ అధికారులు వెల్లడించారు. బకాయల విషయంలో.. ఇతర ప్రాంతాల్లో సైతం ఇదే పంథా అనుసరించాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Feb 23 , 2025 | 09:23 PM