విమానయాన వ్యవస్థల్లో లోపాలు:DGCA
ABN, Publish Date - Jun 25 , 2025 | 07:11 AM
DGCA: ఎయిరిండియా విమాన ప్రమాదంతో అప్రమత్తమైన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దేశంలోని ప్రధాన విమానాశ్రయాలను ఇటీవల పరిశీలించింది. ఈ క్రమంలోనే విమానయాన వ్యవస్థల్లో అనేక లోపాలున్నాయని గుర్తించినట్లు తెలిపింది.
Delhi: ఎయిరిండియా (Air India) విమాన ప్రమాదంతో (Plane Crash) అప్రమత్తమైన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దేశంలోని ప్రధాన విమానాశ్రయాలను ఇటీవల పరిశీలించింది. ఈ క్రమంలోనే విమానయాన వ్యవస్థల్లో అనేక లోపాలున్నాయని (Aviation system deficiencies) గుర్తించినట్లు తెలిపింది. డీజీసీఏ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆధ్వర్యంలోని రెండు బృందాలు ఇటీవల ఢిల్లీ, ముంబయి సహా దేశంలోని ఆయా ప్రధాన విమానాశ్రయాల్లో సమగ్ర పరిశీలనలు నిర్వహించాయి. ఫ్లైట్ ఆపరేషన్స్, ర్యాంప్ సేఫ్టీ, ఏయిర్ ట్రాఫిక్ కంట్రోల్, కమ్యూనికేషన్, నేవిగేషన్ సిస్టమ్స్, ప్రీ-ఫ్లైట్ మెడికల్ ఎవాల్యూయేషన్స్ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.
ఇవి కూడా చదవండి:
For More AP News and Telugu News
Updated at - Jun 25 , 2025 | 07:11 AM