టెన్షన్ లో సీఎం రేవంత్..కాంగ్రెస్ ఎమ్మెల్యే ల రహస్య భేటీ |
ABN, Publish Date - Feb 01 , 2025 | 09:12 PM
తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగర శివార్లలో 11 మంది ఎమ్మెల్యేల భేటీ అయ్యారని సమాచారం. అయితే వారిలోన నలుగురు పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఉన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగర శివార్లలో 11 మంది ఎమ్మెల్యేల భేటీ అయ్యారని సమాచారం. అయితే వారిలోన నలుగురు పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఉన్నారు. ఇక ఫోన్ టచ్‌లోకి మరో ఆరుగురు ఎమ్మెల్యేలు వెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీ అధికారంలో ఉన్న తమ పనులు కాకపోవడంతో సదరు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారట.
అలాగే బిల్లుల విషయంలో నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని వారు ఆరోపిస్తున్నారు. అయితే ఈ సమావేశం ఆర్థిక, రెవెన్యూ మంత్రుల లక్ష్యంగా ఈ సమావేశం జరిగిందని ఓ చర్చ వైరల్ అవుతోంది. మరోవైపు ఈ రహస్య భేటీ ప్రచారాన్ని ఎమ్మెల్యేలు ఖండించారు. ఇదంతా బీఆర్ఎస్ సోషల్ మీడియా దుష్ప్రచారంలో భాగమని వారు అభివర్ణించారు.
రేవంత్ రెడ్డి పాలన చూసి ఓర్వలేకనే ఈ ఫేక్ ప్రచారమని ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. ఇంకోవైపు ఈ కథనాల నేపథ్యంలో పీసీసీ రంగంలోకి దిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు మధ్య సమన్వయం కోసం కసరత్తు చేస్తోంది. ఆ క్రమంలో కలిసి మాట్లాడుకుందా రావాలంటూ సదరు ఎమ్మెల్యేలకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఫోన్ చేశారని తెలుస్తోంది.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 01 , 2025 | 09:12 PM