వారిని కోటీశ్వరుల్ని చేస్తా: సీఎం రేవంత్ రెడ్డి..
ABN, Publish Date - Mar 08 , 2025 | 08:44 PM
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు ఇవ్వనున్నట్లు తీపి కబురు చెప్పారు.
హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు ఇవ్వనున్నట్లు తీపి కబురు చెప్పారు. తెలంగాణ ఆడబిడ్డలను త్వరలో కోటీశ్వరుల్ని చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. ఇవాళ (శనివారం) మహిళా దినోత్సవం సందర్భంగా భారీఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో రూ.550 కోట్లతో నూతన భవన నిర్మాణాలు, చారిత్రక కట్టడాల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ మహిళా సంఘాల ఆర్టీసీ అద్దె బస్సులను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. కాగా, ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు, మహిళా సంఘాల నేతలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Car Accident: అంతా చూస్తుండగానే అదుపుతప్పిన కారు.. క్షణాల్లోనే..
Posani Krishna Murali: పోసానికి షాక్ ఇచ్చిన విజయవాడ కోర్టు.. మరో కేసులో..
Updated at - Mar 08 , 2025 | 08:45 PM