Chandrababu: ఇది నా పూర్వజన్మ సుకృతం..
ABN, Publish Date - Jan 31 , 2025 | 04:17 PM
పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండలో శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు చేశారు. ఆత్మార్పణ దినోత్సవం సందర్బంగా అమ్మవారికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టు వస్ర్తాలు సమర్పించారు.
CM Chandrababu: దేశ వ్యాప్తంగా ఆర్యవైశ్యులే కాకుండా అందరి భక్తుల మన్ననలు పొందుతున్న ఏకైక దేవత వాసవి కన్యకా పరమేశ్వరి అని సీఎం చంద్రబాబు చెప్పారు. తొలిసారిగా వాసవి కన్యక పరమేశ్వరి అమ్మ వారిని దర్శించుకోవడం, ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. ఆర్యవైశ్యులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి తెలివితేటలతో అభివృద్ధి పరచాలన్నది ప్రభుత్వ ధ్యేయమని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
Updated at - Jan 31 , 2025 | 04:22 PM