విశాఖ స్టీల్ ప్లాంట్ కి కేంద్రం శుభవార్త

ABN, Publish Date - Jan 16 , 2025 | 08:26 PM

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. స్టీల్ ప్లాంట్‌కు రూ. 17 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీకి ప్రకటించింది. ఆర్థిక ప్యాకేజీపై శుక్రవారం కేంద్రం అధికారికంగా ఓ ప్రకటన చేయనుంది.

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. స్టీల్ ప్లాంట్‌కు రూ. 17 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీకి ప్రకటించింది. ఆర్థిక ప్యాకేజీపై శుక్రవారం కేంద్రం అధికారికంగా ఓ ప్రకటన చేయనుంది. దీంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆ సంస్థ ఉద్యోగుల్లో ఏర్పడిన ఆందోళనకు దాదాపుగా తెర పడనుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై గత ప్రభుత్వ హయాంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కానీ గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు కూటమికి పట్టం కట్టాడు.

దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. దాంతో రాజధాని అమరావతితోపాటు రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ పనులు సైతం ఊపుందుకొన్నాయి. అలాగే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ సాధించుకొన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగిపోయిందంటూ ఆ సంస్ధ ఉద్యోగుల్లో నిన్న మొన్నటి వరకు తీవ్ర ఆందోళన నెలకొంది. అలాంటి వేళ.. మోదీ ప్రభుత్వంతో కూటమి ప్రభుత్వం సంప్రదింపులు జరిపి.. విశాఖ ఉక్కును మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jan 16 , 2025 | 08:26 PM