Nellore Farms Damage: నెల్లూరులో భారీగా నీట మునిగిన అరటి పంట

ABN, Publish Date - Oct 30 , 2025 | 02:32 PM

మొంథా తుపాను దెబ్బకు ఏపీ చిగురుటాకులా వణికింది. రాయసీమలోని చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు అన్ని ప్రాంతాలను వరద ముంచెత్తింది. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది. ఈ తుపాను రైతులకు కన్నీరు మిగిల్చింది.

నెల్లూరు, అక్టోబర్ 30: మొంథా తుపాను దెబ్బకు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh Cyclone) చిగురుటాకులా వణికింది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు అన్ని ప్రాంతాలను వరద ముంచెత్తింది. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది. ఈ తుపాను రైతులకు కన్నీరు మిగుల్చింది. మరికొన్ని రోజుల్లో చేతికి పంట వస్తుందని అనగా.. మొంథా తుపాను రూపంలో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఇక నెల్లూరు జిల్లాలో అయితే భారీగా అరటి తోటలు నీట మునిగాయి. దీంతో రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ప్రభుత్వం కూడా ప్రజలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటుంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు, మంత్రులు (Flood Relief Efforts)పర్యటిస్తూ తాము ఉన్నామంటూ ప్రజలకు భరోసా ఇస్తున్నారు.


Also Read:

లావు ఉన్న వారికి నిమ్మ తొక్కలు ఓ వరం.. ఎలా అంటే?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు..

Updated at - Oct 30 , 2025 | 02:55 PM