Vikarabad: తొమ్మిదేళ్ల్ల బాలికపై యువకుడి అత్యాచారయత్నం
ABN , Publish Date - Aug 06 , 2025 | 04:24 AM
ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన మంగళవారం వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం నేవీ రాడార్ కేంద్రంలో జరిగింది.
దామగుండం నేవీ రాడర్ కేంద్రంలో ఘటన
పూడూరు, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన మంగళవారం వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం నేవీ రాడార్ కేంద్రంలో జరిగింది. ఓ మహిళ నాలుగు రోజుల కిందట తన తొమ్మిదేళ్ల కూతురు, తమ్ముడు, మామతో కలిసి నేవీ రాడార్ కేంద్ర నిర్మాణ కూలీ పనులకు వచ్చింది. మంగళవారం ఆమె పనికి వెళ్లగా ఆమె కూతురు వారు నివాసం ఉండే షెడ్డు బయట ఆడుకుంటోంది.
అక్కడే నిర్మాణ కూలీగా పనిచేస్తున్న బిహార్ రాష్ట్రానికి చెందిన కృష్ణకుమార్ (24) అనే యువకుడు ఆ బాలికను షెడ్డులోకి తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. భయపడిన బాలిక గట్టిగా కేకలు వేయడంతో ఆ పక్కన పనులు చేస్తున్న కూలీలు, స్థానికులు అక్కడికి వచ్చారు. నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.