Alwal: చాందిని చికిత్సకు సాయం చెయ్యరూ..
ABN , Publish Date - Jan 17 , 2025 | 04:38 AM
అన్న కూతురిని ప్రేమించిన యువకుడి తండ్రి, వారి ఇంటిపై పెట్రోల్ పోసి యువతి చిన్నాన్న నిప్పు పెట్టిన ఘటనలో కాలిన గాయాలతో ఆస్పత్రి పాలైన చిన్నారి చాందిని(4) కోలుకుంటోంది.

అన్న కూతురిని ప్రేమించిన యువకుడి ఇంటికి చిన్నాన్న నిప్పుపెట్టిన ఘటనలో గాయపడ్డ చాందిని
వైద్య ఖర్చులకు దాతల సాయం కోరుతున్న తల్లిదండ్రులు
అల్వాల్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): అన్న కూతురిని ప్రేమించిన యువకుడి తండ్రి, వారి ఇంటిపై పెట్రోల్ పోసి యువతి చిన్నాన్న నిప్పు పెట్టిన ఘటనలో కాలిన గాయాలతో ఆస్పత్రి పాలైన చిన్నారి చాందిని(4) కోలుకుంటోంది. అయితే, తమ కుమార్తెకు చికిత్సకు దాతలు సాయం చేయాలని చాందిని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. అల్వాల్ పోలీసుస్టేషన్ పరిధి గోపాల్‌నగర్, ఎరుకల బస్తీలో జనవరి 14న జరిగిన ఘటనలో ప్రదీప్ అనే యువకుడి తండ్రి ప్రకాశ్(60), వారి ఇంటికి సమీపంలో ఆడుకుంటున్న చాందిని కాలిన గాయాలతో ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. చాందినిని తల్లిదంద్రులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా వైద్యులు శస్త్ర చికిత్స చేశారు.
కూలి పనులు చేసుకుని జీవించే తాము.. కుమార్తె వైద్యానికి ఇప్పటికే రూ.2లక్షలు ఖర్చు పెట్టామని చాందిని తల్లిదండ్రులు దిలీప్, శాంతమ్మ ‘ఆంధ్రజ్యోతి’ వద్ద వాపోయారు. ఐసీయూలో ఉండడంతో ప్రతీ రోజు కనీసం రూ.15వేలు ఆస్పత్రికి చెల్లించాల్సి ఉందన్నారు. చాందిని చికిత్సకు దాతలు ఆర్థిక సాయం చేయాలని వేడుకుంటున్నారు. ఫోన్ పే, గుగూ ల్ పే నెంబర్ 7684052533, అకౌంట్ నెంబర్ 50100526253660 హెచ్‌డీఎ్‌ఫసీ, రాజేంద్రనగర్ శాఖ ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్ హెచ్‌డీఎ్‌ఫసీ0001031కు దాతలు ఆర్థిక సాయం పంపాలని కోరారు. ఇక, 50 శాతం కాలిన గాయాలతో గాంధీ ఆస్పత్రిపాలైన ప్రదీప్ తండ్రి ప్రకాశ్‌కు చికిత్స కొనసాగుతోంది. మరోపక్క, ఈ కేసులో ప్రధాన నిందితుడైన వివేకానంద(37) అల్వాల్ పోలీ్‌సస్టేషన్‌కు వచ్చి గురువారం లొంగిపోయాడు. పవన్(29), ఏల్లే్‌ష(31)ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురినీ రిమాండ్‌కు తరలించారు.