Share News

ఎమ్మెల్సీ అభ్యర్థికి తప్పిన ప్రమాదం

ABN , Publish Date - Feb 23 , 2025 | 04:41 AM

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్‌-ఆదిలాబాద్‌-మెదక్‌-నిజామాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్‌రావు స్వల్పంగా గాయపడ్డారు.

ఎమ్మెల్సీ అభ్యర్థికి తప్పిన ప్రమాదం

  • రోడ్డు ప్రమాదంలో శేఖర్‌రావుకు స్వల్పగాయాలు

  • లారీ ఢీ కొట్టడంతో ధ్వంసమైన కారు

కోరుట్ల, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్‌-ఆదిలాబాద్‌-మెదక్‌-నిజామాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్‌రావు స్వల్పంగా గాయపడ్డారు. తన కారులో ఆయన నిజామాబాద్‌ నుంచి జగిత్యాల వైపు వెళ్తుండగా కోరుట్ల దగ్గర ఓ వంతెనపై ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Feb 23 , 2025 | 04:41 AM