Share News

పని ఒత్తిడి భరించలేక ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈఈ ఆత్మహత్య

ABN , Publish Date - Jan 30 , 2025 | 04:51 AM

నిజామాబాద్‌ జిల్లాలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈఈ (మిషన్‌ భగీరథ)గా పని చేస్తున్న సాయిచరణ్‌(25) అనే యుకుడు పని ఒత్తిడి భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం జరిగింది.

పని ఒత్తిడి భరించలేక ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈఈ ఆత్మహత్య

  • నిజామాబాద్‌ జిల్లాలో ఘటన

  • పని ఒత్తిడితో మిర్యాలగూడలో జూనియర్‌ అసిస్టెంట్‌ అదృశ్యం

ధర్పల్లి, మిర్యాలగూడ అర్బన్‌, జనవరి 29 (ఆంరఽధజ్యోతి): నిజామాబాద్‌ జిల్లాలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈఈ (మిషన్‌ భగీరథ)గా పని చేస్తున్న సాయిచరణ్‌(25) అనే యుకుడు పని ఒత్తిడి భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం జరిగింది. సాయిచరణ్‌ గత 3 నెలలుగా ధర్పల్లిలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈఈగా కొనసాగుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం డిచ్‌పల్లి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని నడిపెల్లి గ్రామశివారులో పురుగుల మందు తాగాడు. బుధవారం ఉదయం గమనించిన స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయిచరణ్‌ మరణించాడు. మృతుడు పని ఒత్తిడి భరించలేక.. మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తల్లిదండ్రులు చెబుతున్నారు.


కాగా.. ‘అమ్మా.. కంప్యూటర్‌పై పనిచేయడం నా వల్లకావడం లేదు.. పని ఒత్తిడి తట్టుకోలేకపోతున్నా..’ అంటూ నల్లగొండ జిల్లాలో జూనియర్‌ అసిస్టెంట్‌ నూనె ప్రవీణ్‌ (30) మంగళవారం రాత్రి తన తల్లికి ఫోన్‌ చేసి చెప్పాడు. బుధవారం ఉదయం పలుమార్లు ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు ఆచూకీ కోసం ఆరా తీసినా ఫలితం దక్కలేదు. దీంతో మిర్యాలగూడ పట్టణ పోలీసులను ఆశ్రయించారు. మిర్యాలగూడ తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రవీణ్‌ గత డిసెంబరు నుంచి జూనియన్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. పని ఒత్తిడి పెరిగి మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు పలు సందర్భాల్లో ప్రవీణ్‌ ఫోన్‌చేసి తమతో చెప్పుకునేవాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ క్రమంలో వేములపల్లి మండల కేంద్రంలోని సాగర్‌ ఎడమకాల్వ కట్టపై ఉన్న స్కూటీని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 30 , 2025 | 04:51 AM